వెంకీని లైన్‌లో పెట్టిన‌ మాట‌ల మాంత్రికుడు..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఏ సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేదు. కానీ, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ చిత్రానికి స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. అలాగే ఇటీవ‌లె సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు త్రివిక్ర‌మ్‌.

ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కారు వారి పాట చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. అయితే ఈలోపే త్రివిక్ర‌మ్ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సీనియ‌ర్ స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్‌ను లైట్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మ‌హేష్ త‌ర్వాత వెంకీతో ఓ సినిమా చేయాల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నార‌ట‌.

అందుకే ఇటీవ‌ల వెంకీకి ఓ క‌థ చెప్పార‌ట‌. అది బాగా న‌చ్చ‌డంతో వెంకీ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని టాక్ న‌డుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పుడెప్పుడు ప్ర‌క‌ట‌న వ‌స్తుందా అని వెంక‌టేష్ అభిమానులు ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా, నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి చిత్రాలకు వెంకీతో త్రివిక్రమ్‌ పని చేశారు. కానీ, దర్శకుడిగా కాకుండా ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు.

Share post:

Latest