తమిళనాడులో జోరుగా కౌంటింగ్‌..వార్ వన్‌సైడ్ చేస్తున్న డీఎంకే కూట‌మి!

తమిళనాడు రాష్ట్రంలో ఎవ‌రు సీఎం పీఠం ఎక్కించబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. కొద్ది సేప‌టి క్రీత‌మే కౌంటింగ్ ప్రారంభం కాగా.. మరి కొన్ని గంట‌ల్లో ఫలితాలపై స్పష్టత రాబోతుంది. తమిళనాడులో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో నిలిచాయి.

డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(దినకరన్ పార్టీ) గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశాయి. అలాగే సినీ నటుడు కమల్‌హాసన్ కూడా మకల్క నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి.. బ‌రిలోకి దిగారు. అయితే వార్ వన్‌సైడేనని.. అధికారం డీఎంకేదేనని పలు ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం..తమిళనాడులో ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. డీఎంకే కూటమి 110 పైగా స్థానాల్లో ఆధిక్యకత కొన‌సాగిస్తోంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 75 స్థానాల్లో ఆధిక్యకత కనబరుస్తోంది. దినకరన్ పార్టీ ఏఎంఎంకే రెండు చోట్ల ఆధిక్యకతలో ఉంది.