సూర్య సరసన నటి షీలా కుమార్తె..!?

బుల్లితెరతో మొదలు పెట్టి ఇప్పుడు వెండితెరకి అడుగు పెట్టి తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. ఈమె అలనాటి ప్రముఖ నటి షీలా కూతురు. రజిషా ఇప్పటికే కొన్ని మలయాళ మూవీస్ లో నటించింది. తాజాగా ధనుష్ హీరోగా నటించిన కర్ణన్ మూవీతో రజిషా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంతుంది.

ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఆయన తండ్రి సురేశ్ రీమేక్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా రజిషా విజయన్ కి కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో సూర్య సరసన నటించే అవకాశం డాకింది. కూతాతిల్ ఓరుతాన్ చిత్రం ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ హీరో సూర్యతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రజిషాను హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం.

Share post:

Latest