పెళ్లి విష‌యంలో సుధీర్ కీల‌క నిర్ణ‌యం..నిరాశ‌లో ఫ్యాన్స్‌?!

సుడిగాలి సుధీర్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ స్టేజ్ మీద చిన్న ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ సుధీర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ బుల్లితెరపై స్టార్‌గా అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవ‌లె హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈయ‌న గాలోడు సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే..బుల్లితెర‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అయిన సుధీర్ పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడా అని ఆయ‌న ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే సుధీర్ పెళ్లి గురించి ఎన్నెన్నో కథలు, క‌థ‌నాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్‌ పెళ్లి చేసుకుంటార‌ని ఎప్ప‌టిక‌ప్పుడు వార్తలు రావ‌డం.. వాటిని వీరిద్ద‌రూ ఖండించ‌డం జ‌రుగుతూనే ఉంటుంది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. పెళ్లి విష‌యంలో సుధీర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. సుధీర్‌ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని, మరో రెండేళ్ల వరకు బ్యాచిలర్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలని డిసైడ్‌ అయినట్లు సమాచారం. అయితే సుధీర్ నిర్ణ‌యంపై ఆయ‌న ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.

Share post:

Latest