ఆకట్టుకుంటున్న `ముగ్గురు మొనగాళ్లు` ట్రైల‌ర్‌!

ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్‌ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ముగ్గురు మొన‌గాళ్లు. అభిలాష్‌రెడ్డి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్‌ రామారావు నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ ట్రైలర్ లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా.. దీక్షిత్ శెట్టి మూగవాడిగా.. వెన్నెల రామారావు అంధుడిగా మూడు ప్రధాన పాత్రదారులను పరిచయం చేశారు.

హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరిగిన నేపథ్యంలో ఈ కేసును ఛేదించడానికి పోలీసులు ఈ ముగ్గురి సహాయం తీసుకుంటారు. మ‌రి ఈ ముగ్గురు ఆ కేసును ఎలా చేధించారు? ఈ క్ర‌మంలో వారికి ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌లు ఏంటీ? అన్న‌దే క‌థ‌గా ట్రైల‌ర్ బ‌ట్టీ తెలుస్తోంది. సినీ జర్నలిస్ట్ టీఎన్నార్ ను కూడా ట్రైల‌ర్ లో చూపించారు. మొత్తానికి ఆధ్యంతం ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

Share post:

Popular