అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి..!?

తెలుగు బుల్లితెర టెలివిజన్ షోలపై అల్లరి చేసే యాంకర్ ఎవరంటే టక్కున చాలా మంది శ్రీముఖి అనే చెబుతారు. తన పంచ్ డైలాగులతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. తాజాగా అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లికి రెడీ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈమె యాంకర్ గా ఎన్నో షోలు చేసింది. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన పటాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది. స్టేజి పైన యాంకర్ రవి తో చేసిన కెమిస్ట్రీ యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో శ్రీముఖి ఫేమస్ అయ్యింది. ఈ తరుణంలో జీ తెలుగు 16 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సాయంత్రం ‘జీ మహోత్సవం’ అనే ఈవెంట్ ప్రసారం కానుంది. దీనికి శ్రీముఖి హోస్టుగా వ్యవహరించింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో శ్రీముఖికి అమెరికా అబ్బాయితో పెళ్లి జరగబోతున్నట్లు చూపించారు. ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఓ స్కిట్‌లో భాగంగా గల్లీ బాయ్స్ సద్దాం హుస్సేన్ టీమ్ శ్రీముఖికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

Share post:

Popular