పెళ్లిపై శ్రీ‌ముఖి క్రేజీ ఫీలింగ్స్‌..ఆ హీరోను వాడుకుని మ‌రీ..?!

బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒక‌రైన శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌ముఖి బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో త‌ర్వాత శ్రీ‌ముఖి టీవీ షోలు, సినిమాల‌తో బిజీ బిజీగా గడుపుతోంది.

ఇటీవ‌లె ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇక సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తుంది. తాజాగా కూడా శ్రీ‌ముఖి లైవ్ చిట్ చాట్ నిర్వ‌హించ‌గా.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ న‌న్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు.

అందుకు శ్రీ‌ముఖి కింగ్ నాగార్జున‌ను వాడేసుకుని మ‌రీ పెళ్లిపై త‌న ఫీలింగ్స్‌ను బ‌య‌ట పెట్టింది. నాగ్ హీరోగా తెర‌కెక్కిన మన్మథుడు సినిమాలో `వద్దురా సోదర పెళ్లంటే నూరేళ్ళ మంటారా` అనే సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ సాంగ్ వీడియోనే శ్రీ‌ముఖి పోస్ట్ చేసి.. పెళ్లిపై తన ఫీలింగ్స్ రివిల్ చేసింది.