పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ సింగర్..?

May 22, 2021 at 3:54 pm

టాలీవుడ్ సింగర్ మధు ప్రియ పోలీసులను ఆశ్రయించారు. తనకు ఎవరో బ్లాంక్ కాల్స్ చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో మధుప్రియ హైదరాబాద్ షీ టీమ్స్ కు మెయిల్ లో ద్వారా కంప్లైంట్ చేశారు. అయితే షీ టీమ్స్ ఆమె మెయిల్ ను సైబర్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు బ్లాంక్ కాల్స్ చేస్తున్నారని మధు ప్రియ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బ్లాంక్ ఫోన్ కాల్స్ డీటెయిల్స్ ను సైబర్ క్రైమ్ కు అందజేశారు. మధు ప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 509, 354బి సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

జానపద గేయాలతో పాపులర్ మధుప్రియ. బిగ్ బాస్ షో ద్వారా కూడా మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది. సినిమాల్లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. ఆమె పాడిన ఫిదా సినిమాలోని “వచ్చిండే” అనే పాట, సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని “హీ ఈజ్ సో క్యూట్” పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఆమెకు “ఆడపిల్లనమ్మా” అనే పాటతో చిన్న వయసులోనే గుర్తింపు లభించింది.

పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ సింగర్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts