`ఆదిపురుష్` కోసం రంగంలోకి మ‌రో బాలీవుడ్ న‌టుడు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణుడిగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మ‌రో బాలీవుడ్ న‌టుడిని రంగంలోకి దింపుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో మేఘనాథుని పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాను ఎంపిక చేశార‌ట ఓం రౌత్‌. ఇందులో భాగంగానే సిద్ధార్థ్ శుక్లాను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest