ఆ ఇబ్బందుల్లో శృతి..?

ఇప్పుడున్న హీరోయిన్లలో శృతి హాస‌న్ కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కమల్ హాసన్ ముద్దు బిడ్డ అయిన శృతి హాస‌న్ అటు తెలుగు, ఇటు తమిళంలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన డ్యాన్స్, నటన, అందంతో కుర్రాళ్ల మనసులను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈమె అప్పుడప్పుడూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లోకెక్కడం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈమె ఓ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె ఇండిపెండెంట్‌గానే ముందుకు వెళుతున్న‌ట్టు చెప్పుకొచ్చింది. తాను ఎవ‌రిపై ఆధార‌ప‌డనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

అమ్మ‌, నాన్న సాయం తాను ఎప్పుడూ తీసుకోనని తెగేసి చెప్పింది. తన కాళ్ల మీద నిల‌బ‌డ‌టానికే ప్ర‌య‌త్నిస్తానని, తన ఖ‌ర్చుల‌కి తానే సంపాదించుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తన బిల్లులు చెల్లించుకోవాలంటే ప‌ని చేయ‌క త‌ప్ప‌దని లేకుంటే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలని శృతి హాస‌న్ చెప్పడం ఇప్పుడు సినీ వర్గాలకు హాట్ టాపిక్ మారింది. క‌రోనా వ‌ల‌న చాలా మంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనే ప్రయత్నం చేయలేదని, అయితే తాను మాత్రం ఓ ఇల్లును కొనుక్కున్నానని తెలిపింది. తన వెనక దేవుడు ఉన్నాడ‌నేది బలంగా విశ్వ‌సిస్తానంటూ శృతి హాస‌న్ కామెంట్ చేయడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

Share post:

Latest