ఆగిపోయిన సమంత-నయనతార సినిమా..నిరాశ‌లో ఫ్యాన్స్‌?

విజ‌య్ సేతుప‌తి హీరోగా స‌మంత‌, న‌య‌న‌తార హీరోయిన్లుగా విగ్నేష్ శివన్ ద‌ర్శ‌క‌త్వంలో గ‌త ఏడాది కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -

సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు క్రేజీ స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోవ‌డంతో.. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల‌ హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ చేశారు. కానీ, ఇంత‌లోనే క‌రోనా రావ‌డం మ‌రియు ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది.

మ‌రోవైపు విజ‌య్ సేతుప‌తి వ‌రుస సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డంతో.. ఆయ‌న డేట్స్ దొర‌క‌డం చాలా క‌ష్టంగా మారింద‌ట‌. అలాగే కథ విషయంలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయట. అందుకే ఈ సినిమా ఇప్ప‌ట్లో సెట్స్ మీద‌కు వెళ్లే ప‌రిస్థితి లేద‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో సమంత, నయనతార మ‌రియు విజ‌య్ సేతుప‌తి ఫ్యాన్స్ నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.

Share post:

Popular