రోజా కూతురికి ఐ ల‌వ్ యూ చెప్పిన వ్య‌క్తి..అన్షు షాకింగ్ రిప్లై!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్‌, న‌గరి ఎమ్మెల్యే రోజా సెల్వమని కూతురు అన్షు మాలిక గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి సినిమాలు చేయ‌క‌పోయినా అన్షుకు సోష‌ల్ మీడియాలో మాత్రం సూప‌ర్ క్రేజ్ ఉంది.

ఈ క్ర‌మంలోనే అన్షు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికరంగా సమాధానం చెప్పింది.

అయితే ఓ నెటిజ‌న్ రోజా కూతురికి వినూత్నంగా త‌న మ‌న‌సులో మాట చెప్పాడు. స్పానిష్ భాషలో ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. అందుకు అన్షు స్పందిస్తూ… ఐ లవ్‌ యూ.. థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చి షాక్‌కు గురి చేసింది. దీంతో అన్షు స‌మాధానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular