బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన రెజీనా?

శివ మనసులో శృతి సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన రెజీనా కాసాండ్రా.. కొత్త జంట సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిట్ల‌ను కూడా ఖాతాలో వేసుకుంది. కానీ, ప్ర‌స్తుతం రెజీనా కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రెజీనాకు పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు.

- Advertisement -

దీంతో హీరోయిన్‌గా కాకుండా విల‌న్‌గా కూడా ప‌లు చేత్రాలు చేసింది. అయిన‌ప్ప‌టికీ.. ఈ అమ్మ‌డు గ్రాఫ్ పెర‌గ‌లేదు. రెజీనా ప్ర‌స్తుతం తెలుగులో నేనేనా అనే సినిమా చేస్తుంది. అలాగే త‌మిళ్‌లో ఒక‌టి, రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

బాలీవుడ్ లో రాయ్ కపూర్ ఫిల్మ్స్ అండ్ ఎమ్మీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా `రాకెట్ బాయ్స్` అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇదో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్. ఇందులో ఇశ్వాక్ సింగ్, జిమ్ సర్భ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సిరీస్‌లో రెజానీను ఓ కీల‌క పాత్ర కోసం ఎంపిక చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూఆ పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది.

Share post:

Popular