ఆ విషయంలో పూరి చాలా మంచోడంటున్న నటి హేమ..!

May 13, 2021 at 12:47 pm

నటి హేమ అంటే చాలా మందికి తెలుసు. టాలీవుడ్ సినిమాలో ఆమె బ్రహ్మానందంతో పండించిన సీన్స్ ఇప్పటికీ చాలా మంది మరిచిపోకుండా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో వదిన, భార్య, అక్క పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియా ద్వారా ఈమె తన జీవితంలోని విషయాలను అప్పడప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ.. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తో తనకున్న అనుబంధాన్ని తెలిపింది. పూరి ప్రేమించిన అమ్మాయితో తామే దగ్గరుండి పెళ్లి చేశామని చెప్పింది. ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే ఇచ్చేదాన్ని అని, తన భర్తకు తెలీయకుండా దాచుకున్న డబ్బులను కూడా పూరీ అడగ్గానే ఇచ్చేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. తాను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా ఉన్న సమయంలోనే పూరి జగన్నాథ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసేవాడని, అప్పుడే పూరీ జగన్నాథ్ తో పరిచయం ఏర్పడిందని తెలిపింది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ తాము బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ లా ఉంటున్నట్లు తెలిపింది.

ఆ విషయంలో పూరి చాలా మంచోడంటున్న నటి హేమ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts