భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఇంట్లో కరోనా కలకలం..?

భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ అశ్విన్‌ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఇంట్లో ఉన్న పది మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌ వెల్లడించింది. ఇటీవల టెస్టులు నిర్వహించుకోగా, కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒకే ఇంట్లోని ఆరుగురు పెద్దవారికి, నలుగురు పిల్లలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది.

కాబ్బటి అందరు జాగ్రత్తగా ఉండండి, కరోనా టీకా తీసుకోండి అని ప్రీతి ట్వీట్లలో అందరికి సూచించింది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌ సీజన్‌కు కొంత కాలం విరామం ప్రకటిస్తున్నట్లు గత ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. కొవిడ్‌-19 పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులకు మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు.

Share post:

Latest