ఖిలాడి మూవీ విడుదల వాయిదా..?

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ ఖిలాడి. ప్లే స్మార్ట్ అనేది ఈ మూవీ టాగ్ లైన్. రవితేజ మరోకసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చితం ఇది. జయంతీలాల్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ హవీష్ ప్రొడన్స్ పతాకం పై ఈ మూవీ తెరకెక్కుతుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రంలో భాగస్వామి కావటం మరో విశేషం.

అసలు అంతా బాగుంటే ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇది వరకు ప్రకటించారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ పనులన్నీ నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత వల్ల ఈ చిత్రం రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. పరిస్థితులు అన్ని సర్దుకున్నాక మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు మేకర్స్.

Share post:

Latest