క‌రోనా బాధితుల కోసం ముందుకొచ్చిన ‘రాధేశ్యామ్‌’ నిర్మాత‌లు!

ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ దేశాన్ని అత‌లా కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకెండ్ వైవ్‌లో మ‌రింత వేగంగా ఈ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతోంది. స‌రైన స‌దుపాయాలు లేక‌ ప్ర‌తి రోజు వేల సంఖ్య‌లో క‌రోనా మ‌ర‌ణాలు చోటుచేసుకుంటున్నాడు.

ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాధేశ్యామ్ నిర్మాత‌లు త‌మ వంతుగా కొవిడ్ బాధితుల‌కు సాయం అందించారు. ఇటీవ‌ల రాధేశ్యామ్ సినిమాలో హాస్పిటల్ సీన్ కోసం 50 సెట్ ప్రాప‌ర్టీల‌ను రూపొందించార‌ట‌. ఇందులో బెడ్స్‌, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌, స్ట్రెచ‌ర్స్‌, ఇత‌ర మెడిక‌ల్ ఎక్యూప్‌మెంట్స్ ఉన్నాయ‌ట‌.

అయితే క‌రోనా బాధితుల కోసం వీట‌న్నింటిని 9 పెద్ద ట్ర‌క్‌లు ఉప‌యోగించి ఆసుప‌త్రికి చేర్చార‌ట రాధేశ్యామ్ నిర్మాత‌లు. దీంతో వారిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్ర‌భాస్‌-పూజా హెగ్డే హీరోహీరోయిన్‌గా కె.రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంతో రాధేశ్యామ్ తెర‌కెక్కుతోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.