`రాధే శ్యామ్` రిలీజ్‌కు ముందే ప్ర‌భాస్ స‌రికొత్త రికార్డ్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో రాధే శ్యామ్ ఒక‌టి. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ప్ర‌భాస్ ఓ స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఇటీవ‌లె విడుద‌లైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ దక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే అదే జోష్‌లో తాజాగా ఈ గ్లింప్స్ వీడియో సుమారు 5 లక్షల లైక్స్ సాధించింది. దీంతో ఐదు లక్షల లైక్స్ సాధించిన ఫస్ట్ ఎవర్ గ్లింప్స్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Share post:

Popular