ఓటీటీ వైపు చూస్తున్న రాఘవేంద్రరావు..పెళ్లి సందDపై న్యూ అప్డేట్‌?

May 28, 2021 at 6:04 pm

శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా హీరో,హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెర‌కెక్కిస్తున్న చిత్రం పెళ్లి సంద‌D 2. శ్రీకాంత్‌ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ ఈ చిత్రం వ‌స్తోంది.

ఈ రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై నిర్మించారు. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ప‌లు ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాకు క్రేజీ ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆ ఆఫ‌ర్లు నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిపెట్టేలా ఉండ‌డంతో.. రాఘవేంద్ర రావు ఓటీటీ వైపు చూస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత ఉందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

ఓటీటీ వైపు చూస్తున్న రాఘవేంద్రరావు..పెళ్లి సందDపై న్యూ అప్డేట్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts