పాయల్ ఇంట్లో విషాదం..ఏమైందంటే..?

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి లక్షల సంఖ్యలో జనాలు మృత్యువాతపడ్డారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, రష్యా తదితర దేశాల్లో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోనూ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చాక ఇండియాలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ముందు ఏ స్థాయి వ్యక్తులైనా తలవంచక తప్పడం లేదు.

ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఎక్కువ సంఖ్యలోనే మృత్యువాత పడ్డారు. తాజాగా పాయల్‌ రాజ్‌పుత్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంతగానో ప్రేమించే అనితా ఆంటీ కరోనాతో చనిపోయినట్లు ఆమె విలపించారు. ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. అనితా ఆంటీ చివరిగా చెప్పిన మాట.. ‘నాకు ఊపిరాడడం లేదు.’ ఈ మాటలకు హీరోయిన్ పాయల్ కంటతడి పెట్టారు. తనకు కానీ అవకాశం వస్తే కరోనాను అంతం చేస్తానని పాయల్ చెప్పారు.