సీక్రెట్ గా వివాహం చేసుకున్న పవన్ హీరోయిన్..?

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణిత సుభాష్‌ నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహం బెంగుళూరులో జరిగింది. ప్రణిత నివాసంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ప్రణిత పెళ్లి టాపిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

పెళ్లి వార్తలపై ప్రణిత స్పందించింది. వారిది లవ్‌ కమ్‌ అరెంజెడ్‌ మ్యారెజ్‌ అని చెప్పింది. చాలా కాలంగా నితిన్‌ తనకు తెలుసు అని, పెళ్లితో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. తమ కుటుంబాలు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నట్లు ప్రణీత చెప్పింది. వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం తనకు ఇష్టం ఉండదని, తన వివాహం ఎలా అయితే జరగాలని అనుకుందో అలానే జరిగిందని ప్రణీత చెప్పింది. ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, రభస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హంగామా-2, భుజ్ అనే సినిమాలతో పాటు కన్నడలో రమణ అవతార అనే సినిమాలో నటిస్తుంది.

Share post:

Latest