పవన్ సినిమా నిర్మాతలకు నోటీసులు..?

టాలీవుడ్ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటించిన వకీల్‌ సాబ్‌ చిత్రం పై అభ్యంతరం తెలుపుతూ ఒక వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ ని ఆశ్రయించాడు. ఈ చిత్రంలో ఒక సీన్ లో తన ఫోన్‌ నంబర్‌ను యూజ్ చేసారంటూ సుధాకర్‌ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ని ఆశ్రయించి మూవీ నిర్మాతల పై ఫిర్యాదు చేశాడు. తన పర్మిషన్ లేకుండానే వకీల్‌ సాబ్‌ మూవీలో ఒక చోట తన ఫోన్‌ నంబర్‌ను వాడుకుని, స్క్రీన్‌ మీద చూపించారని మేకర్స్ పై కోపం వ్యక్తం చేస్తూ నిర్మాతల పై ఫిర్యాదు చేసాడు.

దీనివల్ల తనకి ఎంతో మంది తరచుగా ఫోన్లు చేస్తూ తనని తీవ్రంగా ఇబ్బంది పాలు చేస్తున్నారని సుధాకర్ తెలిపాడు. కొందరు తనని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని చెప్పుకొచ్చాడు. ఈ విషయం పై సుధాకర్ తరపు లాయర్‌ వకీల్‌ సాబ్‌ మూవీ నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపించారు. దీని పై నిర్మాతలు ఇంకా స్పందించాల్సి ఉంది.

Share post:

Latest