ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కొర‌టాల ట్రీట్‌..ఆక‌ట్టుకుంటున్న న్యూ పోస్టర్!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఆ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు.

అయితే ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాడు కొర‌టాల‌. తాజాగా ఎన్టీఆర్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ ఓ న్యూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

ఈ పోస్ట‌ర్‌లో ఫార్మల్ డ్రస్ లో స్లిమ్ గా, సూప‌ర్‌ హ్యాండ్సమ్ గా ఎన్టీఆర్ క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నంద‌మూరి అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

Image

Share post:

Popular