అక్క‌డి పోలీసులకు మంచు లక్ష్మి లంచ్‌!

కంటికి క‌నిపించిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా సంఖ్య‌లో నమోదు అవుతున్నారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇటీవ‌లె తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్ క‌రోనాను అదుపు చేసేందుకు లాక్‌డౌన్ పెట్టారు.

అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు మంచు లక్ష్మి ముందుకు వచ్చారు. ఫిలింనగర్‌లోని సీవీఆర్‌ న్యూస్‌ చౌరస్తా చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు లాక్‌డౌన్ కార‌ణంగా మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న మంచి ల‌క్ష్మి వారంరోజుల నుంచి లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తున్న 50 మంది పోలీసులకు లంచ్‌ పంపిస్తున్నారు.ఇంట్లోనే వంట మనిషితో భోజనాన్ని తయారు చేసించి తన సిబ్బంది ద్వారా పంపిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు.

Share post:

Popular