మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొదలు..!

దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది ఇలా ఉంటె, మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ షురూ అయింది. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం ఫేజ్‌-1 టీకా పంపిణిలో భాగంగా 60 ఏళ్ల పైబ‌డిన వారికి, 45 ఏళ్ల పైబ‌డిన రోగులకు వ్యాక్సినేష‌న్ ఇవ్వటం మొద‌లు పెట్టారు. అనంత‌రం ఫేజ్‌-2లో 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ టీకా ఇవ్వటం షురూ అయింది.ఆ తరువాత ఇప్పుడు ఫేజ్‌-3లో 18-44 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వాళ్లంద‌రీకి వ్యాక్సినేష‌న్ మొదలు పెట్టారు.

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ్యాక్సిన్ టీకాలు టైంకి అంద‌క‌పోవ‌డంతో ప‌లు కేంద్రాల్లో వాక్సిన్ ప్రక్రియని నిలిపివేశారు. కానీ కరోనా టీకాలు అందిన కొన్ని కేంద్రాల్లో మాత్రం మొద‌లు పెట్టారు. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లోని ఓ వాక్సిన్ కేంద్రానికి కూడా వ్యాక్సిన్‌లు వ‌స్తున్న‌ట్లు ఇన్ఫర్మేషన్ అందటంతో, టీకా కేంద్రం వ‌ద్ద జ‌నం వేచి ఉన్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి వ్యాక్సినేష‌న్ ప్రక్రియ త‌మ కేంద్రంలోమొదలు అవుతుందని అక్క‌డ అధికారులు చెప్పారు.