ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ అదేన‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఒక‌టి. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయితే త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ సినిమాలో హీరో టైమ్ ట్రావెల్ చేస్తాడట. అలా టైమ్ మెషీన్ లో ఆయన 2050 కాలానికి వెళ్లిపోతాడ‌ట‌.

అక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట. అంతేకాదు, 2050 వ సంవత్సరం సెటప్ ను ఈ చిత్రంలో నాగ్ అశ్విన్ చూపించ‌నున్నాడ‌ట‌. మరి ఈ వార్త‌లో ఎంత మేర నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest