బెడ్‌పై అనుతో అల్లు శిరీష్ రొమాన్స్‌..వైర‌ల్‌గా ప్రీ లుక్‌!

అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గౌర‌వం సినిమాలో ఇండ‌స్ట్రీలో హీరోగా ఎంట్రీ వ‌చ్చిన శిరీష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సినిమాలు చేయ‌గా.. వాటిలో శ్రీరస్తు శుభమస్తు చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈయ‌న త‌న 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ క‌థ‌ను సెలెక్ట్ చేసుకున్నాడు.

- Advertisement -

అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే రేపు శిరీష్ బ‌ర్త్‌డే కావడంతో.. ఉదయం 11 గంటలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నామనే విషయాన్ని ప్రీ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. బెడ్ మీద చేతులు అడ్డుపెట్టి అనుతో శిరీష్‌ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయిన ఈ ఇంటెన్స్ ప్రీ లుక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని అల్లు వారబ్బాయి.. స‌రైన హిట్ కొట్టేందుకు ఈ సారి త‌న‌లోని రొమాంటిక్ యాంగిల్‌ను బ‌య‌ట పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని తాజాగా విడుద‌ల చేసిన ప్రీ లుక్ పోస్ట‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. మ‌రి ప్రీ లుక్కే ఇలా ఉందంటే.. రేపు విడుద‌ల కాబోయే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఇంకెంత రొమాంటిక్‌గా ఉంటుందో చూడాలి.

Image

Share post:

Popular