ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొర‌టాల‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో త‌న 30వ‌ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్టాయిలో నిర్మించబోతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్ కోసం కొర‌టాల శివ‌ ఓ స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్ రెడీ చేసిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ 30వ సినిమా టైటిల్‌ ను పుట్టిన రోజు సందర్బంగా రివీల్ చేసేందుకు కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడట. ఇప్ప‌టికే టైటిల్‌ లోగోను డిజైన్‌ చేయించారనే వార్తలు వస్తున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Latest