నేను శైలజ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ చిత్రంతో వరుస ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
అలాగే జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఒక్కో సినిమాకు కోట్లు పుచ్చుకుంటున్న కీర్తి.. తొలి సంపాదన కేవలం రూ. 500 వందలట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తినే స్వయంగా తెలిపింది. కీర్తి సురేశ్ బాల నటిగా నటించినప్పుడు.. నిర్మాతలు తనకు డబ్బుల కవర్ ఇచ్చేవారట.
కానీ, ఆ కవర్లో ఎంత డబ్బు ఉందో చూడకుండానే.. నేరుగా తన తండ్రికి ఇచ్చేదట. కానీ ఓసారి కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసినందుకు గాను రూ. 500 ఇచ్చారట. ఆ డబ్బును కీర్తి నేరుగా అందుకున్నారు. ఈ కారణంగానే తన ఊహ తెలిసిన మొదటి సంపాదన ఈ రూ. 500 అనే చెప్పుకొచ్చింది.