అఖండ‌లో గెస్ట్ రోల్‌..బాబాయ్ కోసం అబ్బాయ్ గ్రీన్‌సిగ్నెల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ ఉంటుంది. అది ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర అని.. సుమారు ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే ఆ పాత్ర‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించ‌నున్నాడ‌ట‌. ఇటీవ‌లె చిత్ర యూనిట్ క‌ళ్యాణ్ రామ్‌ను సంప్ర‌దించ‌గా.. బాబాయ్ కోసం అబ్బాయ్ వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest