అత‌డు నో అంటే సినిమాలు ఆపేస్తా..కాజ‌ల్ షాకింగ్ కామెంట్స్‌!

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇటీవ‌లె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వెత్త గౌత‌మ్ కిచ్లూను పిళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.

ఇక ప్రస్తుతం కాజల్‌ పెళ్లికి ముందు అంగీకరించిన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ముంబై సాగాతో పాటు ప‌లు వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కాజ‌ల్‌కు.. పెళ్లికి ముందులాగానే భ‌విష్య‌త్తులో కూడా వ‌రుస‌ సినిమాలు చేసేందుకు మీ భ‌ర్త ఒప్పుకుంటారా? అనే ప్ర‌శ్న ఎదురైంది.

అందుకు సమాధానంగా కాజల్ .. ఏమో తెలియ‌దు, ఎంతకాలం సినిమాల్లో నటిస్తానో చెప్ప‌లేను. నా భర్త ఎప్పుడు సినిమాల్లో నటించడం ఆపేయమంటే అప్పుడు ఆపేస్తాను. నా కుటుంబ సభ్యులు తర్వాత నా భర్త సహకారంతోనే నేను ముందుకు వెళ్లగలుగుతున్నా. కానీ కిచ్లు నో అన్న రోజు తప్పకుండా యాక్టింగ్‌ ఆపేస్తా అని షాకింగ్ అన్స‌ర్ ఇచ్చింది.

Share post:

Latest