ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం..?

high court

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఇక రేపటి నుంచి లాక్‌డౌన్‌ విధించడం పై హైకోర్టు సీరియస్ అయింది. రేపటి నుంచి లాక్‌డౌన్ అంటే ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. కనీసం వీకెండ్ లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సడెన్‌గా రేపటి నుంచి లాక్‌డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ సమయంలో ఎలా వారి ప్రాంతాలకు వెళ్లిపోతారని ప్రశ్నించింది.

అయితే గతేడాది లాక్ డౌన్ వలన కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించగా.. 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని తెలిపారు. ఇక సాయంత్రం సమయంలో ఏమైనా సడలింపులు ఉన్నాయని అడగగా, ఎలాంటి రిలాక్షేషన్స్ లేవని అడ్వకేట్ జనరల్ తెలిపారు.