ఆ కుర్ర హీరోయిన్‌తో ర‌వితేజ రొమాన్స్‌..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌?

క్రాక్‌తో సూప‌ర్ హిట్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ జోరు చూపిస్తున్నాడు. ర‌వితేజ ఓకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఈయన ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు.

మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే క‌థ ప్ర‌కారం ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉండ‌నుండ‌గా..కన్నడ భామ శ్రీలీలను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ భామ రాఘవేంద్ర రావు తెర‌కెక్కిస్తున్న పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

ఈ సినిమా విడుద‌ల‌కు ముందే శ్రీ‌లీల‌ ర‌వితేజతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. అయితే శ్రీ‌లీల‌ను ర‌వితేజ‌కు జోడీగా తీసుకోవ‌డంపై ప‌లువురు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ర‌వితేజ, శ్రీ‌లీల మ‌ధ్య దాదాపు ముప్పై ఏళ్ల ఏజ్ గ్యాప్‌ ఉంటుంది. అంత చిన్న అమ్మాయి ర‌వితేజ స‌ర‌స‌న న‌టించ‌డం అభిమానులు కూడా జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Sree Leela Images | Download Hd Photos, Stills | Aktend.com

Share post:

Latest