సింగం 4 కోసం సిద్దమవుతున్న సూర్య…?

అటు తెలుగు, ఇటు తమిళంలోనూ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నటనలో సూర్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. హీరో సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన ‘సింగం’ జనాదరణను పొందింది. తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ నడుస్తోందని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కథనాలొస్తున్నాయి. కానీ వాటి మీద ఓ క్లారిటీ లేదు. ఎట్టకేలకు సింగం-4 మూవీకి సంబంధించి తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన సమాచారం అందింది. సూర్య కథానాయకుడిగా హరి దర్శకత్వంలో సింగం-4 ఆగస్ట్ నుంచి మొదటి షెడ్యూల్ ప్రారంభమవుతోంది.

సింగం ఫ్రాంఛైజీలో తొలి మూడు సినిమాల్ని మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ఎవరైనా స్టార్ హీరోతో గెస్ట్ అప్పీరెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూర్య రెట్టించిన ఉత్సాహంతో వరుసగా కథలను, దర్శకులను ఫైనల్ చేస్తున్నారు. పాండిరాజ్, టి.జె.జ్ఞాన్‌వేల్ తదితరులతో సూర్య కథలను ఫైనల్ చేసి చిత్రీకరణలు ప్రారంభించారు. ఇప్పుడు సింగం-4 పైనా దృష్టి సారించారు.

Share post:

Latest