ఫుట్ బాల్ క‌థాంశంతో రానున్న నాని సినిమా..?

తన నటనతో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన నాచురల్ స్టార్ నాని స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో కొన్ని సినిమాలను చేశాడు. క‌బ‌డ్డీ బ్యాక్ డ్రాప్ లో భీమిలి క‌బ‌డ్డీ జట్టు, క్రికెట్ నేపథ్యంలో తీసిన జెర్సీ సినిమాలో నటించి మెప్పించాడు. ఇవి నానికి నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. జెర్సీ సినిమా జాతీయ అవార్డులు కూడా అందుకుంది. అయితే నాని ఇప్పుడు మ‌రో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కథను చేయబోతున్నాడట. ఈ సినిమాపై ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఆ సినిమా ఫుట్ బాల్ క‌థాంశంతో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఆ సినిమాను ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడట. ఆ కొత్త డైరెక్టర్ చెప్పిన కొత్త లైన్ నానికి నచ్చిందట. దీంతో ఆ కథను చేయడానికి నాని ఒప్పుకున్నాడని సమాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై క్లారిటీ రానుంది. నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్, టక్ జగదీష్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్ళీ థియేటర్లు ఓపెన్ అయ్యాకే నాని సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Share post:

Popular