ఆ యంగ్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ `జాతిర‌త్నాలు` భామ‌?

జాతిర‌త్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది హైద్రాబాద్ పిల్ల ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మ‌దిని గెలుచుకున్న ఫ‌రియా..మొదట్లో మోడలింగ్ తో పాటు.. యూ ట్యూబర్ గా పాప్యులర్ అయ్యింది.

ఇదే స‌మ‌యంలో జాతిర‌త్నాలు సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ కర్లీ హెయిర్, పొడుగు సుందరి త‌న అమాయకత్వపు నట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేసింది. ఇక ప్ర‌స్తుతం ఈమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ‌రియా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో న‌టించే అవ‌కాశం అందుకున్న‌ట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్‌.. త్వ‌ర‌లోనే మరో రెండు సినిమాలను కూడా పట్టాలెక్కించనున్నాడు. వాటిలో ఒక సినిమాలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.

Share post:

Latest