వెబ్‌సైట్ ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్లు అందచేస్తున్న సోను..!

May 29, 2021 at 12:29 pm

భారత్‌లో రెండో దశలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తూ ప్రజలందరినీ అతలాకుతలం చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలుస్తూ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్. ఎల్లప్పుడూ ప్ర‌జ‌ల‌కు తనకు తోచిన సహాయం అందించే సోనూసూద్ ఇప్పుడు తాజాగా ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను కూడా నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే.

ఎవరికైనా ఆక్సిజన్‌ కావాలంటే చాలు, దేశంలో ఎక్కడికైనా సిలిండర్లు వారికీ అందించేలా చేసేందుకు ఆయ‌న కార్యక్రమం చేపట్టారు. డీటీడీసీ కొరియ‌ర్ ద్వారా సిలిండర్లు అవసరం అయిన వారికీ సరఫరా చేయాల‌ని సోను నిర్ణ‌యించుకున్నారు. ఆక్సిజ‌న్ అవసరం ఉన్న వారు ఎవరైనా సరే www.umeedysonusood.com లోకి వెళ్లి తమ వివ‌రాలు తెల‌పాల‌ని సోను కోరారు. వాటిని వాళ్ళ టీం వెంటనే ప‌రిశీలించి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల‌ను ఫ్రీగా పంపిస్తాన‌ని సోనూసూద్ అన్నారు. ఈ వెబ్సైటు ద్వారా దేశంలో ఎక్కడైనా ఆక్సిజన్‌ అవసరం ఉన్న వారు ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకుని సిలిండర్ ను ఫ్రీగా పొందుచు.

వెబ్‌సైట్ ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్లు అందచేస్తున్న సోను..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts