మత్స్యకారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్‌!

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు రాష్ట్రంలో ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇక ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ స‌ర్కార్ సంక్షేమ ప‌థకాల అమ‌లులో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. తాజాగా మత్స్యకారులకు సీఎం జ‌గ‌న్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో ఏడాది రూ.10 వేల చొప్పున ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఈ మేర‌కు గురువారం రూ. 130.46 కోట్ల నిధులను విడుదల చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ఇక ఈ ఏడాది 1,19,875 కుటుంబాలను అర్హులుగా తేల్చ‌గా.. వీరంద‌రికీ ఈ నెల 18వ తేదీన ఖాతాల్లోకి సీఎం జగన్మోహన్ రెడ్డి నగదును జమ చేయనున్నారు.