మ‌రో రీమేక్‌కు సై అంటున్న చిరు..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫర్ రీమేక్‌, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మ‌రియు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది.

అయితే ఇంకా ఈ చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్ల‌క ముందే చిరు మ‌రో రీమేక్ సినిమా చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నాడ‌ట‌. అజిత్ హీరోగా చేసిన ఎన్నై అరిందాళ్ సినిమాకి రీమేక్ చేయాల‌ని చిరు భావిస్తున్నార‌ట‌. నిజానికి ఈ చిత్రాన్ని ఎంతవాడుగానీ పేరుతో తెలుగులో విడుదల చేశారు.

అయిన‌ప్ప‌టికీ చిరూ ఈ సినిమా రీమేక్ పట్ల ఉత్సాహాన్ని చూపించారట. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. అంతేకాదు, ఈ రీమేక్ బాధ్య‌త‌ల‌ను సాహో దర్శకుడు సుజీత్ కి అప్పగించారని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest