`క్యాబ్ స్టోరీస్` ట్రైలర్ విడుద‌ల చేసిన త‌మ‌న్నా!

బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య‌, శ్రీహాన్‌ జంటగా నటించిన చిత్రం `క్యాబ్‌ స్టోరీస్‌`. కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇమేజ్ స్పార్క్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్. కృష్ణ నిర్మించారు. లవ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో గిరిధర్‌, ప్రవీణ్‌, ధన్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మే 28 నుంచి ఓటీటీ స్పార్క్ లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క్యాబ్ స్టోరీస్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. క్యాబ్ లో ఓ బ్యాగ్ మారిపోవడం వల్ల కొందరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. దీంట్లో ఉన్న మలుపులేంటనేది మెయిన్ క‌థ అని తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ థింకింగ్.. ఈ రెండూ రిలేషన్ కే కాదు.. ఆరోగ్యానికి కూడా హానికరం అని ట్రైల‌ర్ చివ‌ర్లో దివి చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. మెత్తానికి సూప‌ర్ థ్రిల్లింగ్ గా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది.

Share post:

Latest