సిద్ధార్థ్ శుక్లా ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్ 3 టీజర్ మీ కోసం…!

May 14, 2021 at 3:21 pm

కరోనా వల్ల చాలా సినిమాలు థియేటర్లో విడుదల కాకుండా పోయాయి. దీంతో చాలా మంది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. మరికొందరు వెబ్ సీరిస్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్3ని మే 29 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ హీరో సిద్ధార్థ్ శుక్లా ఫస్ట్‌ ‌లుక్ రివీల్ చేశారు. హ్యాండ్సమ్ హంక్ సిద్ధార్థ్‌ను అగస్త్యా రావ్‌గా పరిచయం చేస్తూ షేర్ చేసిన పిక్ ఇంటెన్స్‌గా ఉన్నాయి.

బిగ్ బాస్ సీజన్ 13తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సిద్ధార్థ్‌కు ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ కాగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగిపోయింది.టెలివిజన్ సూపర్ స్టార్ సిద్దార్థ్ శుక్లా మరియు తొలిసారిగా సోనియా రథీ నటించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎఎల్‌టిబాలాజీతో పాటు 11 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3 ’టీజర్‌ను ఉదయం 11:11 గంటలకు విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు భారీ స్దాయిలో ఉండటం విశేషం.

సిద్ధార్థ్ శుక్లా ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్ 3 టీజర్ మీ కోసం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts