బీసీసీఐ కీలక నిర్ణయం..?

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన మీటింగ్ లో మిగిలిన సీజన్ మొత్తాన్ని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. గత సీజన్ మ్యాచ్ లను నిర్వహించిన స్టేడియంలలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో మిగిలిన 31 మ్యాచ్ లు జరగనున్నాయి.

మిగతా టోర్నీని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య నిర్వహించే అవకాశం ఉంది. ఆటగాళ్లు, సిబ్బంది ఇలా అందరినీ బయోబబుల్ వాతావరణంలో ఉంచి మ్యాచ్ లను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. మ్యాచ్ లన్నీ దుబాయ్‌, అబుదాబీ, షార్జా స్టేడియంలలోనే జరగనున్నాయి. త్వరలోనే మ్యాచ్ ల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీని యూఏఈ లో రెండు సార్లు నిర్వహించారు. అక్కడ ఐపీఎల్ ను నిర్వహించడం ఇది మూడో సారి. యూఏఈలో జరిగే ఈ మిగతా మ్యాచుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడే అవకాశాలు కనిపించడం లేదు.

Share post:

Latest