`గబ్బర్ సింగ్`లో మొద‌ట ఏ హీరోను అనుకున్నారో తెలుసా?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్‌. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2012 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఈ చిత్రంలో మొద‌ట అనుకున్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాద‌ట‌. ఈ సినిమాకు ముందుగా మాస్ మహారాజా రవితేజతో అనుకున్నారట. ఈ విష‌యాన్ని నిర్మాత బండ్ల గ‌ణేష్ స్వ‌యంగా తెలిపారు. బండ్ల మాట్లాడుతూ.. నేను నిర్మాతగా మారడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. అందుకే ఆయనను నేను దేవుడిగా భావిస్తా.. పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమా చేశా.. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది.

సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్లీ పవన్ తో సినిమా చేయాలనీ అడగటానికి మొహమాటపడ్డాను. కానీ, గబ్బర్ సింగ్ సినిమాను రవితేజతో తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్న సమయంలో పవన్ పిలిచి నాతో మరో సినిమా చేసుకో అన్నారు. దాంతో ఆయన్ను పెట్టి గబ్బర్ సింగ్ సినిమాను రూపొందించామని చెప్పుకొచ్చారు.

Share post:

Latest