ఆగ‌ని మృత్యుఘోష‌..క‌రోనాతో మ‌రో న‌టుడు క‌న్నుమూత‌!

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈ మ‌హ‌మ్మ‌రి దెబ్బ‌కు సినీ ప్ర‌ముఖులు వ‌ర‌స‌గా మృత్యువాత ప‌డుతున్నారు. తాజాగా కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటుచేసుకుంది.

అసురన్ సినిమాలో నటించిన నితీష్ వీర(45) క‌రోనాతో క‌న్నుమూశారు. ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన ఈయ‌న.. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించ‌డంతో కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. దీంతో న‌తీష్ మృతిపై సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

అసురన్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో విలన్‌గా కనిపించిన నితీష్ వీర.. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన పుదుపెట్టై సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత అనేక చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

Share post:

Latest