అనును అక్క‌డ కిస్ చేసిన శిరీష్‌..అదిరిన `ప్రేమ కాదంట‌` ఫ‌స్ట్ లుక్స్‌!

అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ త‌న 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ క‌థ‌ను సెలెక్ట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రీ లుక్ పోస్టర్స్ తో ఆసక్తి రేపుతూ వ‌చ్చిన చిత్ర యూనిట్‌.. నేడు శిరీష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టైటిల్ మ‌రియు రెండు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ను విడుద‌ల చేసింది.

Image

ఈ చిత్రానికి ప్రేమ కాదంట అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఓ ప్రేమ‌క‌థ‌ని కొత్త కోణంలో చూపించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టు టైటిల్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఇక అను సెల్ఫీ తీస్తుండ‌గా..ఆమె చెంప‌పై శిరీష్ ముద్దు పెట్టే స్టిల్ తో మొద‌టి ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేశారు.

Image

రెండో పోస్ట‌ర్‌లో అను, శిరీష్ ఇద్ద‌రూ ప్రేమలో మునిగి తేలుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. లవ్ అండ్ రిలేషన్ షిప్ ల మధ్య సరికొత్త దృక్పథాన్ని ఈ సినిమాలో చూపించబోతున్న‌ట్టు ఈ రెండు పోస్ట‌ర్స్ ద్వారా తెలుస్తోంది. కాగా, రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.