రామ్ చ‌ర‌ణ్‌కు థ్యాంక్స్ చెప్పిన బ‌న్నీ..ఎందుకంటే?

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు స్పెష‌ల్‌గా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌కు ఇటీవ‌లె క‌రోనా వైర‌స్ సోకిన సంగ‌తి తెలిసిందే.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌క‌టించారు. దీంతో రామ్ చ‌ర‌ణ్ వెంట‌నే బ‌న్నీకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ లెట‌ర్ కూడా పంపాడు. అందులో `నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు బాగున్నాక ఓసారి కలుద్దామని ప్రేమతో నీ చరణ్` అని రాసి ఉంది.

ఇక చ‌ర‌ణ్ పంపిన స్వీట్ మెసేజ్‌ను బ‌న్నీ త‌న ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇద్ద‌రు హీరోల అభిమానులు ఫ‌ల్ ఖుషీ అవుతున్నారు.

Share post:

Latest