విజ‌య్ త‌ర్వాత ఆ రేర్ ఫీట్ అందుకున్న హీరోగా బ‌న్నీ!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని..దక్షిణాదిలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన ఏకైక హీరోగా విజ‌య్ నిలిచాడు.

అయితే ఇప్పుడు ఈ రేర్ ఫీట్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసిన మరో సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు.

దీంతో బ‌న్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉండగా.. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Share post:

Latest