కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు మురుగదాస్ కాంబోలో వచ్చిన చిత్రం గజిని. ఈ చిత్రంలో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా నటించారు. 2005 లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా సూర్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందట. అది కూడా ఈ సీక్వెల్‌ను మురగదాస్ అల్లు అర్జున్‌తో చేయబోతున్నాడట. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత బన్నీ ఏ డైరెక్టర్‌కు కమిట్ అవుతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే మురుగదాస్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే బన్నీకి మురుగదాస్ కథ చెప్పారని.. అది బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పనట్టు వార్తలు వస్తున్నాయి.. పూర్తి కొత్త కథతో .. గజిని 2 పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఇక త్వరలోనే ఈ చిత్రంపై ప్రకటన రానుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.