ఆహా ఓటిటిలో సాయి పల్లవి సినిమా..?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా ‘అథిరన్’.. ‘అనుకోని అతిథి’ పేరుతో డబ్బింగ్ చేసి తెలుగు ఓటీటీ ఆహాలో రిలీజ్ చేసేందుకు డేట్స్ ఫిక్స్ చేస్తూ తాజాగా పోస్టర్ వదిలారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ దర్శకత్వం వహించగా మే 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్‌గా నిలిచింది.

మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించాడు. ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతి కృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ రూపొందిన ఈ సినిమా యదార్ధ కథ ఆధారంగా తెరకెక్కింది. రీసెంట్‌గా ‘అనుకోని అతిథి’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ టీమ్ క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ జారీ చేసింది. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు.

Share post:

Latest