తెలంగాణలో మరో పరీక్ష వాయిదా

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షలు వాయిదా పడడంతో పాటు మరి కొన్ని రద్దు అవుతున్నాయి. వివిధ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు తేదీలను సైతం అధికారులు పొడిగిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ తో పాటు అనేక ప్రవేశ పరీక్షల దరఖాస్తు తేదీని అధికారులు పొడిగించారు. తాజాగా రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్ర‌వేశాలకు నిర్వ‌హించే లాసెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్ర‌కారం మే 26తో ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి గ‌డువు ముగిసింది.

అయితే కరోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో దరఖాస్తు గడువును జూన్ 3 వ‌ర‌కు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. మరో వైపు టీజీ సెట్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు క‌న్వీన‌ర్ ప్ర‌వీణ్‌కుమార్ తెలిపారు. దీంతో రేపు జ‌ర‌గాల్సిన గురుకులాల ఐదో త‌ర‌గ‌తి ప‌రీక్ష వాయిదా ప‌డింది. టీజీసెట్ ప‌రీక్ష‌లను మ‌ళ్లీ ఎప్పుడు నిర్వ‌హించ‌నున్నామో తర్వాత వెల్ల‌డిస్తామ‌ని క‌న్వీన‌ర్ వివ‌రించారు. దీంతో పరీక్షల కోసం విద్యార్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నట్లైయ్యింది.

Share post:

Popular